Share News

గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:04 AM

మండల కేంద్రంలో చర్చి సెంటర్‌ వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని బొబ్బిలి రూరల్‌ సీఐ ఎస్‌.శ్రీని వాస్‌ తెలిపారు.

 గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

రామభద్రపురం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో చర్చి సెంటర్‌ వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని బొబ్బిలి రూరల్‌ సీఐ ఎస్‌.శ్రీని వాస్‌ తెలిపారు. వారి నుంచి సుమారు రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకు న్నామన్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. ఒడిశా రాష్ట్రం నుంచి బస్సులో గరివిడి మండలం బాగువలస గ్రామానికి చెందిన గొండేల దిలీప్‌, చీపురుపల్లి కుమ్మరి కాలనీకి చెందిన నడిమింటి అఖిల్‌ తీసుకు వచ్చారన్నారు. రామభద్ర పురం నుంచి చీపురుపల్లి ఆటో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పట్టుకు న్నామన్నారు. వారి నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకు న్నామన్నారు. గతంలో 11 మందిని అరెస్టు చేసి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పట్లో వీరిద్దరు తప్పిం చుకున్నారన్నారు. అంతేకాకుండా గొండేల దిలీప్‌కుమార్‌పై పెదమానాపురం పోలీసు స్టేషన్‌లో ఒక కేసు నమోదై ఉందన్నారు. సమావేశంలో ఎస్‌ఐ వెలమ ల ప్రసాదరావు, ఏఎస్‌ఐ ఆర్‌.అప్పారావు, కానిస్టేబుల్‌ సురేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:04 AM