Share News

Preschool Attendance ప్రీస్కూల్‌ అటెండెన్స్‌లో మన్యం టాప్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:57 PM

Manyam Tops in Preschool Attendance ప్రీస్కూల్‌ అటెండెన్స్‌లో మన్యం అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా 95 శాతం హాజరుతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచినట్లు మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపాల్‌ ఎ.సూర్యకుమారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ విషయం చెబుతూ .. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని అభినందించారు.

  Preschool Attendance  ప్రీస్కూల్‌ అటెండెన్స్‌లో మన్యం టాప్‌

పార్వతీపురం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ప్రీస్కూల్‌ అటెండెన్స్‌లో మన్యం అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా 95 శాతం హాజరుతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచినట్లు మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపాల్‌ ఎ.సూర్యకుమారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ విషయం చెబుతూ .. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని అభినందించారు. అన్ని సూచికల్లో కూడా జిల్లా మెరుగుదల కనిపించినట్టు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల సేవలు, పిల్లలకు పోషకాహార పంపిణీ , బాల్య వివాహాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. హైరిస్క్‌ గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి పిల్లల ఎత్తు, బరువును పునఃసమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతుల పనులను చేపడు తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసీడీఎస్‌ పీడీ టి.కనదుర్గ, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:57 PM