Finland ఫిన్లాండ్‌కు మన్యం మాస్టార్లు
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:06 AM
Manyam Teachers Head to Finland అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 29 మందిని ఆ దేశం పంపిస్తుండగా అందులో మన్యం మాస్టార్లు ఉండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఆగస్టు 17 నుంచి 26 వరకు ఆ దేశంలో పర్యటన
ప్రస్తుతం విజయవాడలో శిక్షణ
జియ్యమ్మవలస, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 29 మందిని ఆ దేశం పంపిస్తుండగా అందులో మన్యం మాస్టార్లు ఉండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 2025-26లో రాష్ట్ర ఉత్తమ టీచర్లుగా ఎంపికైన జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (బీసీ)లో పనిచేస్తున్న యర్రా శంకరరావు, పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బౌరోతు శంకరరావులు ఆగస్టు 17వ తేదీ నుంచి 26 వరకు ఫిన్లాండ్ దేశంలో పర్యటించనున్నారు. అక్కడ అమలవుతున్న విద్యా విధానాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. ప్రస్తుతం వారు విజయవాడ లయోలా కాలేజీలో ఆ దేశ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. ఇంటర్నేషనల్ ప్రొఫెష నల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఫిన్లాండ్‌కు చెందిన తుర్కూ యూనివర్సిటీ సాంకేతిక నిపుణులు, ప్రొఫెసర్లు ఆరి, సోరి, సోవిలు ఆ దేశ ఎడ్యుకేషన్ సిస్టంపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఎంపికైన 29 మంది టీచర్లకు మూడు దశల్లో అంతర్జాతీయ శిక్షణ ఇవ్వనున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ పీడీ బి.శ్రీనివాసరావు తెలిపినట్లు మన్యం ఉపాధ్యాయులు తెలిపారు.