Share News

Triple IT ట్రిపుల్‌ ఐటీకి మన్యం విద్యార్థులు

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:53 PM

Manyam Students Secure Seats in Triple IT మన్యం జిల్లా నుంచి 173 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు అర్హత సాధించారు. టెన్త్‌ అనంతరం ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుకు వారంతా ఎంపికయ్యారు.

 Triple IT ట్రిపుల్‌ ఐటీకి మన్యం విద్యార్థులు

పార్వతీపురం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లా నుంచి 173 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు అర్హత సాధించారు. టెన్త్‌ అనంతరం ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుకు వారంతా ఎంపికయ్యారు. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో గత నెలలో విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 12న ప్రవేశాలకు అర్హుల జాబితాను ప్రకటించారు. ఈ మేరకు నూజివీడు ఐఐటీకి 52మంది , ఆర్‌కే వ్యాలీ (ఇడుపులపాయ) కళాశాలకు 21 మంది , ఒంగోలు ఐఐటీకి 18 మంది , శ్రీకాకుళంలో ఐఐటీకి 82 మంది మన్యం విద్యార్థులు ప్రవేశాలకు అర్హత సాధించారు. వారికి ఈ నెల 19న కౌన్సెలింగ్‌ నిర్వహించి జూలై 1 నుంచి తరగతులు నిర్వహించనున్నారు. ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 13 , 2026 | 11:53 PM