Share News

Yogandhra Competitions యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటిన మన్యం

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:22 AM

Manyam Shines at State-Level Yogandhra Competitions యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లావాసులు సత్తాచాటారు. ప్రథమ స్థానంలో నాలుగు , ద్వితీయ స్థానంలో రెండు, తృతీయ స్థానంలో ఆరు బహుమతులను కైవసం చేసుకున్నారు. విజేతలతో పాటు మిగిలిన వారికి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఇన్‌చార్జి జేసీ హేమలత తదితరులు అభినందనలు తెలిపారు.

  Yogandhra Competitions యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో  సత్తాచాటిన మన్యం

పార్వతీపురం, జూన్‌19(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లావాసులు సత్తాచాటారు. ప్రథమ స్థానంలో నాలుగు , ద్వితీయ స్థానంలో రెండు, తృతీయ స్థానంలో ఆరు బహుమతులను కైవసం చేసుకున్నారు. విజేతలతో పాటు మిగిలిన వారికి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఇన్‌చార్జి జేసీ హేమలత తదితరులు అభినందనలు తెలిపారు. ఎస్‌ఐ రైటింగ్‌ సీనియర్‌ విభాగంలో గంట రామకృష, యోగా సాంగ్‌లో వై.కైలాసరావు , షార్ట్‌ఫిల్మ్‌ సీనియర్‌ విభాగంలో కె.జనార్థనరావు, జూనియర్‌ విభాగంలో డి.దినేష్‌కుమార్‌ ప్రథమ స్థానంలో బహుమతులను పొందారు. ఎస్‌ఐ జూనియర్‌ విభాగంలో గౌశిక్‌ ప్రణవ్‌సాయి, స్లోగన్‌లో గంటా రామకృష్ణ ద్వితీయ స్థానంలో బహుమతులు దక్కించుకున్నారు. ఇక షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో అనిత, సాంగ్‌ యువ విభాగంలో పి.భాగ్యరాధ, సింక్రనైజేడ్‌ మేల్‌ గ్రూప్‌లో మోహన్‌రావు టీం, విమెన్‌ గ్రూప్‌ లో స్వాతి టీం, సూరజ క్రాంతి టీంలు తృతీయ స్థానంలో బహుమతులు పొందారు.

Updated Date - Jun 20 , 2026 | 12:22 AM