మన్యం కళావేదిక లోగో ఆవిష్కరణ
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:10 AM
కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మన్యం కళావేదిక లోగోను కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి గురువారం కళాకారులు, సాహితీ వేత్తల మధ్య ఘనంగా ఆవిష్కరించారు.
పార్వతీపురం, జనవరి8 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మన్యం కళావేదిక లోగోను కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి గురువారం కళాకారులు, సాహితీ వేత్తల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. జిల్లా ఏర్పడిన తర్వాత సాంస్కృతి, సాహిత్యరంగాల అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికారిక వేదిక ఇదన్నారు. మన్యం కళాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడమే ఈ కళావేదిక ప్రధాన లక్ష్యమన్నారు. 2026 మన్యం జిల్లా సాంస్కృతిక రంగంలో ఒక గొప్ప విజయాన్ని సాధించాలని, కళాకారులు ఈ వేదికను నిరంతర ప్రవాహంలా వినియోగించుకోవాలని కలెక్టర్ కాంక్షించారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.