Manyam Bandh మన్యం బంద్ ప్రశాంతం
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:08 AM
Manyam Bandh Peaceful ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా శనివారం చేపట్టిన మన్యం బంద్ ప్రశాంతంగా ముగిసింది. సమస్యలు పరిష్కారించాలని కోరుతూ పలుచోట్ల గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
సీతంపేట, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా శనివారం చేపట్టిన మన్యం బంద్ ప్రశాంతంగా ముగిసింది. సమస్యలు పరిష్కారించాలని కోరుతూ పలుచోట్ల గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, కొమరాడ, సాలూరు, తదితర చోట్ల బంద్ ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం వరకూ ఏ షాపులు తెరచుకోలేదు. ఆదివాసీ గిరిజనసంఘం ఆధ్వర్యంలో సీతంపేటలో ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంత సమయం పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. జీవో నెం.3 చట్టం చేయాలని, శతశాతం ఉద్యోగాలు గిరిజన యువతకే ఇవ్వాలని , 1/70చట్టం పక్కాగా అమలుచేయాలని, నాన్‌షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజన గ్రామాలకు షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని ఆదివాసీ గిరిజనసంఘం రా ష్ట సహాయ కార్యదర్శి ఏ అశోక్ డిమాండ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్‌ఐ వై.అమ్మన్నరావు ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తుగా మోహరించారు. ఈ నిరసనలో ఆదివాసీ గిరిజన సంఘం, సీఐటీయూ నాయకులు లక్ష్మణరావు, భాస్కరరావు, శ్రీరాములు, రమణారావు, తిరుపతిరావు గిరిజనులు పాల్గొన్నారు.