Share News

నాగావళి నదిలో వ్యక్తి గల్లంతు

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:59 PM

మగ్గూరు గ్రామ సమీపంలో గల నాగావళి నదిలో స్నానానికి దిగి ఓ వ్యక్తి గల్లంతయిన ఘటన శనివారం చోటు చేసుకుంది.

నాగావళి నదిలో వ్యక్తి గల్లంతు

వంగర, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని మగ్గూరు గ్రామ సమీపంలో గల నాగావళి నదిలో స్నానానికి దిగి ఓ వ్యక్తి గల్లంతయిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మగ్గూరు గ్రామానికి చెందిన కొచ్చెర్ల అప్పడు(60) శనివారం స్నానం చేసేందుకు నాగావళి నదికి వెళ్లాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరి సర ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆచూకీ లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్‌ఐ షేక్‌శంకర్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గల్లంతుగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:59 PM