Share News

ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:10 AM

మండలంలోని ఎస్‌.రంగారాయపురం జంక్ష న్‌ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయ పడ్డారని స్థానిక పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వి.జనార్దనరావు ఆదివారం తెలిపారు.

ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు

సంతకవిటి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎస్‌.రంగారాయపురం జంక్ష న్‌ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయ పడ్డారని స్థానిక పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వి.జనార్దనరావు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌.అగ్రహారం గ్రామానికి చెందిన యడ్ల గౌరునాయుడు ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి వస్తుండగా, అదే దిశ లో వస్తున్న గోవిందపురం గ్రామానికి చెందిన అరసాడ పాపినాయుడు నడుపు తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌరునాయుడుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన రాజాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడు ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:10 AM