దొంగతనం కేసులో ఒకరికి తొమ్మిదేళ్ల జైలు
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:10 AM
దొంగతనం కేసులో ఓ వ్యక్తికి తొమ్మిదేళ్లు జైలుశిక్షను సాలూరు జేఎఫ్‌సీఎం న్యాయాధికారి జి.హర్షవర్దన్ విధించారు.
సాలూరు, మార్చి 7(ఆంధ్రజ్యోతి): దొంగతనం కేసులో ఓ వ్యక్తికి తొమ్మిదేళ్లు జైలుశిక్షను సాలూరు జేఎఫ్‌సీఎం న్యాయాధికారి జి.హర్షవర్దన్ విధించారు. సాలూరు పోలీసుల కథనం మేరకు.. రామభద్రపురం మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన లోపింటి గణేష్ మొబైల్ షాపులో రూ.13వేల నగదు, నాలు గు సెల్‌ఫోన్లు అపహరించుకుపోయాడు. ఈ కేసులో నిందితుడికి ఆరు సంవ త్సరాల కారాగార శిక్షణ, రూ.15వేల జరిమానా విధించారు. అలాగే ఇదే నింది తుడు కోటదుర్గమ్మ హుండీ దొంగతనం కేసులో రూ.మరో మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.10వేలు జరిమానా వెరసి తొమ్మిది సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఈ కేసు దర్యాప్తునకు సాలూరు టౌన్ సీఐ బి.అప్పలనాయుడు, ఎస్‌ఐలు డి.అనీల్‌కుమార్, జి.శ్రీనివాసరావు, కోర్టు హెడ్ కానిస్టేబుల్ సత్యంనా యుడు కృషి చేశారు. కేసులను పార్వతీపురం ఎస్టీపీవో మనీషారెడ్డి, ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి మార్గదర్శకత్వంలో దర్యాప్తు చేశారు. ఈ మేరకు నిందితుడి ని బొబ్బిలి సబ్‌జైలుకు తరలించారు.