పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:06 AM
బాడంగి పోలీసు స్టేషన్‌లో 2024 డిసెంబరులో నమోదైన పోక్సో కేసులో వాడాడ వెంకటరమణకు 20 ఏళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యే క న్యాయాధికారి కె.నాగమణి తీర్పు వెలువరించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.
విజయనగరం క్రైమ్/బొబ్బిలి, జనవరి2 (ఆంధ్రజ్యోతి): బాడంగి పోలీసు స్టేషన్‌లో 2024 డిసెంబరులో నమోదైన పోక్సో కేసులో వాడాడ వెంకటరమణకు 20 ఏళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యే క న్యాయాధికారి కె.నాగమణి తీర్పు వెలువరించారని ఎస్పీ దామోదర్ తెలిపారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నా యి. బాడంగి మండలంలో ఓ బాలిక(14) కనిపించడం లేదని ఆమె తల్లి ఇచ్చి న ఫిర్యాదు మేరకు అక్కడి ఎస్‌ఐ జె.తారకేశ్వరరావు 2024 డిసెంబరు 28న కేసు నమోదు చేశారు. బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన వాడాడ వెంక టరమణ ఆ బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడి, పెళ్లి చేసుకుంటానని నమ్మిం చాడు. బాలికను కత్తిపూడి తీసుకుని వెళ్లి లైంగిక దాడి చేశాడు. దాంతో బాలిక మిస్సింగ్ కేసును పోక్టో చట్టం కింద మార్చి బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి దర్యా ప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి అభియోగ పత్రా న్ని దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట ప్రత్యేక న్యా యాధికారి కె.నాగమణి... వెంకటరమణకు శిక్ష ఖరారు చేశారు. బాధితురాలికి రూ.5లక్షల పరిహారం మంజూరు చేశారు. పోలీసుల తరపున పోక్సో కోర్టు ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఖజానారావు వాదనలు వినిపించారని ఎస్పీ తెలి పారు. కేసులో క్రియాశీ లకంగా వ్యవహరించి దోషికి శిక్ష పడేలా సమర్థంగా వ్యవ హరించిన డీఎస్‌పి భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, బాడంగి ఎస్‌ఐ తారకేశ్వరరావు, సీఎంఎస్ హెచ్‌సీ సీహెచ్.రామకృష్ణ, కోర్టు కాని స్టేబుల్ బి.మహేశ్, స్పెషల్ పీపీ ఎం.ఖజానారావులను ఎస్పీ అభినందించారు.