అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:12 AM
మండలంలోని భోజరాజపురం గ్రామ సమీపాన గల ఒక తోటలో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి మృతిచెందాడు.
దత్తిరాజేరు, జూలై 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని భోజరాజపురం గ్రామ సమీపాన గల ఒక తోటలో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పెదమానాపురం ఎస్‌ఐ కళాధర్ గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం భోజరాజపురం వీఆర్‌ఏ సీర సింహాచలం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నీలిరంగు అండర్‌వేర్ ధరించి ఉన్న ఒక వ్యక్తి మృతిచెంది ఉన్నట్టు గుర్తించారు. అతని శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. పక్కనే ఉన్న బ్యాగు పరిశీలించగా అందు లో మృతుడి ఆధార్‌కార్డు లభ్యమైంది. ఆధార్‌కార్డు ప్రకారం వ్యక్తి ఝార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన విశ్వనాథ్ కుడు(33)గా గుర్తించారు. బ్యాగులో కొన్ని మాత్రలు, డాక్టర్ చీటీలు ఉన్నాయి. ఈ మేరకు మృతుడు ఏదో వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమచారం తెలియజేసి, మృతదేహాన్ని గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.