Share News

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:14 AM

మెరకముడిదాం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విజయనగరం(మెరకముడిదాం), అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): మెరకముడిదాం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎం.పాలెం గ్రామానికి చెందిన సీతాన త్రిమూర్తులు(35) తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం మెరకముడిదాం గ్రామంలో బోనెల చిన్నమ్మి ఇంటి శ్లాబ్‌ పనులు చేపట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో ఇంటి నిర్మాణానికి అత్యంత సమీపంలో ఉన్న విద్యుత్‌ తీగలు తగిలి, అక్కడక్కడే షాక్‌తో మృతిచెందాడు. సమాచారం అందుకున్న బుదరాయవలస ఎస్‌ఐ లోకేశ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీపురుపల్లి సీహెచ్‌సీ తరలిస్తామని ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Oct 02 , 2026 | 12:14 AM