విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:00 AM
ప్రమాదవశాత్తు విద్యుదా ఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటన పెంటశ్రీరాంపురం, రేగుబిల్లి గ్రామాల మధ్య మంగళవారం చోటుచేసుకుంది.
గంట్యాడ, జూలై 21(ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు విద్యుదా ఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటన పెంటశ్రీరాంపురం, రేగుబిల్లి గ్రామాల మధ్య మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబం ధించి ఎస్‌ఐ సాయికృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్.కోట మండలం చందలూరు గ్రామానికి చెందిన మాసవర పు గంగునాయుడు(45) పది రోజుల కిందట గంట్యాడ మండ లం పెంటశ్రీరాంపురం గ్రామంలో మట్టి తవ్వడానికి ఎక్సకవేట ర్ తీసుకుని వచ్చారు. మంగళవారం పనులు ముగించుకుని, ఎక్సకవేటర్‌ను ట్రాలీపై ఎక్కించుకుని వెళ్తున్నారు. పెంటశ్రీరాంపురం, రేగుబిల్లి గ్రామాల మధ్యకు వచ్చేసరికి విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయి. వాటిని తప్పించేందుకు గంగునాయుడు కిందకు దిగారు. ట్రాలీని పట్టుకుని.. డ్రైవర్‌కు రైట్ చెప్పుతున్న సమయంలో మిషన్‌కు వైర్లు తగిలాయి. దీంతో గంగునాయుడు షాక్ గురై కిందకు పడిపోయి, అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎస్.కోట ఆసుపత్రికి తరలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. గంగునాయుడు గత 12ఏళ్లగా డ్రైవర్‌గా పని చేస్తున్నారు. గంగునాయుడుకు తల్లి, భార్య, ఇద్దరు కు మార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.