Share News

విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:44 PM

తన చిరకాల వాంఛ సొంత ఇల్లు... ఎంతో కష్టపడి ఇల్లు నిర్మిస్తున్నాడు.. ఆ ఇంటి నిర్మాణం పూర్తికాక ముందే అతడు ఆ ఇంటి మేడమీదే మృ త్యువాత పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీర య్యారు.

విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి
సూరిరెడ్డి (ఫైల్‌)

సాలూరు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): తన చిరకాల వాంఛ సొంత ఇల్లు... ఎంతో కష్టపడి ఇల్లు నిర్మిస్తున్నాడు.. ఆ ఇంటి నిర్మాణం పూర్తికాక ముందే అతడు ఆ ఇంటి మేడమీదే మృ త్యువాత పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీర య్యారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి ప్రాంతానికి చెందిన వెలగల సూరిరెడ్డి (56) దాదాపు 25 ఏళ్లకిందట పట్టణానికి వలసవచ్చాడు. ఇక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతోపాటు ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పట్టణ సమీపంలోని అఫీషియల్‌కాలనీలో ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. అయితే బుధవారం ఉదయం తాను నిర్మించుకుం టున్న ఇంటి ద్వారబంధం ముహూర్తానికి వెళ్లాడు. ఈక్రమంలో మేడకు చేరువగా ఉన్న విద్యుత్‌ తీగల వల్ల సూరిరెడ్డి విద్యుతాఘాతానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సాలూరులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే సూరిరెడ్డి మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు సాయి ఉన్నారు. కుమారునికి కొద్దినెలల కిందటే వివాహమైంది. రూరల్‌ ఎస్‌ఐ రవీంద్రరాజు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 24 , 2026 | 11:44 PM