Share News

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:12 AM

మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన లోచర్ల సాయిబాబు(37) అనే విలేజ్‌ ఎలక్ర్టిక ల్‌ వర్కర్‌ ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

గరివిడి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన లోచర్ల సాయిబాబు(37) అనే విలేజ్‌ ఎలక్ర్టిక ల్‌ వర్కర్‌ ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందారు. బుధవారం సాయంత్రం విపరీతమైన గాలులతో వర్షాలు కురవ డంతో బొండపల్లి గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్‌ వైర్లు వద్ద పనిచేస్తుండగా సాయిబాబుకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. తీవ్ర గాయాలపాలైన అతన్ని తోటి కార్మికులు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయిబాబును పరిశీలించిన స్థానిక వైద్య సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి.. తమ సొంత కారులో అర్ధరాత్రి రాజాంలో ని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి.. సాయిబా బుని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిబాబు బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు. మృతుడికి భార్య లక్ష్మి తోపాటు ఏడేళ్ల కుమారుడు స్వాతిక్‌, ఐదేళ్ల కుమార్తె లయ ఉన్నారు. సాయిబాబు గత 15 సంవత్సరాలుగా గ్రామంలో విలేజ్‌ ఎలక్ర్టికల్‌ వర్కరుగా పనిచేస్తున్నారు. ఈయన కు గ్రామంలో అన్ని కుటుంబాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. సాయిబాబు మరణవార్త వినడంతో గ్రామంతా శోకసంద్రంలో మునిగి పోయింది. అతని భా ర్య, బిడ్డలు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన కుటుంబానికి నష్టపరిహారం అంద జేసి ఆదుకోవాలని ఎలక్ర్టికల్‌ ఉద్యోగుల సంఘ నేతలు కోరుతున్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:13 AM