విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:56 AM
దేవాడ గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై జామి మండలం జి.సింగవరం గ్రామానికి చెందిన మద్దిల రమణ(33) అనే యువకుడు శుక్రవారం మృతిచెందాడు.
కొత్తవలస, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): దేవాడ గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై జామి మండలం జి.సింగవరం గ్రామానికి చెందిన మద్దిల రమణ(33) అనే యువకుడు శుక్రవారం మృతిచెందాడు. దీనిపై సీఐ టీవీ విజయ్ కుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. దేవాడ గ్రామంలో గంతకోర శ్రీను, గంతకోర ధనాజీ, గంధం శ్రీను అనే ముగ్గురు నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నా రు. ఈ ఇంటి శ్లాబు నిర్మాణ పనికి మద్దిల రమణ శుక్రవారం వెళ్లాడు. ఈ మేరకు శ్లాబు నిర్మాణానికి అవసరమైన రాడ్లను కటింగ్మిషన్తో కోస్తున్నాడు. అయితే ఈ కటింగ్మిషన్ వైరుకు ఉన్న ఎలక్ట్రికల్ జాయింట్ ప్రమాదవశాత్తు రమణ కోస్తున్న ఇనుప రాడ్పై పడింది. దీంతో రాడ్ను తాకి ఉన్న రమణ విద్యుత్ షాక్కు గురయ్యాడు. షాక్కు గురైన రమణను వెంటనే వియ్యంపేటలోని పీహెచ్సీకి తీసుకువెళ్లారు. ప్రథమచికిత్స చేసి, కొత్తవలసకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి విశాఖపట్నం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి తల్లి మద్దిల ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిమిత్తం ఎస్ఐ జోగారావుకు అప్పగించినట్టు సీఐ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట తరలించారు.