Share News

గోడ కూలి వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:48 PM

పట్టణంలోని గాంధీ బొమ్మ జంక్షన్‌ వద్ద మంగళవారం గోడ కూలిన ఘటనలో బోర గంగులు(40) అనే వ్యక్తి మృతిచెందాడు.

గోడ కూలి వ్యక్తి మృతి

చీపురుపల్లి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గాంధీ బొమ్మ జంక్షన్‌ వద్ద మంగళవారం గోడ కూలిన ఘటనలో బోర గంగులు(40) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రణస్థలం మం డలం దేవరాపల్లి గ్రామానికి చెందిన గంగులు జీవనోపాధి నిమిత్తం చీపురుపల్లి వచ్చాడు. మెట్ట కాలనీలో ఉంటూ పట్టణంలో కూలి పనులు చేస్తూ కుటుం బాన్ని పెంచుతున్నాడు. దీంట్లో భాగంగానే చీపురుపల్లికి చెందిన సూరు రామ్మో హనరావు అనే వ్యక్తికి చెందిన పాత భవనం కూల్చి వేతకు పని కుదుర్చు కున్నాడు. మంగళవారం మరికొంత మందితో కలిసి భవనాన్ని కూల్చే పనిలో ఉండగా, గోడ జారి మీద పడింది. దీంతో తీవ్ర గాయాల పాలైన గంగులు అక్క డికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

న్యాయం కోసం కుటుంబ సభ్యుల డిమాండ్‌

గంగులు మృతి చెందాడన్న సమాచారంతో అతని భార్య భాగ్యలక్ష్మి, తన కుటుంబ సభ్యులతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. భవన యజమాని తగిన జాగ్ర త్తలు తీసుకోకపోవడం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని ఆమె ఆరోపిం చింది. తమకు న్యాయం జరిగే వరకూ స్టేషన్‌ విడిచి వెళ్లబోమని తేల్చి చెప్పింది. ఆమెకు మద్దతుగా గచ్చలవస, మెట్ట కాలనీకి చెందిన మహిళలు పోలీస్‌స్టే షన్‌కు చేరుకున్నారు. భవన యజమానితో ఘర్షణకు దిగారు. ఈ పరిస్థితుల్లో భవన యజమాని రామ్మోహనరావు తరపున వైశ్య సంఘ ప్రతినిధులు రంగ ప్రవేశం చేసి, బాధితులతో చర్చలు జరిపారు.

Updated Date - Mar 10 , 2026 | 11:48 PM