Share News

మడ్డువలస రిజర్వాయర్‌లో పడి వ్యక్తి మృతి

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:00 AM

మడ్డువల స రిజర్వాయర్‌ దిగువ భాగంలోని నదిలో పడి ఓ వ్యక్తి పడి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

మడ్డువలస రిజర్వాయర్‌లో పడి వ్యక్తి మృతి

వంగర, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): మడ్డువల స రిజర్వాయర్‌ దిగువ భాగంలోని నదిలో పడి ఓ వ్యక్తి పడి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాం అమ్మవారి కాలనీకి చెందిన కోమటిపల్లి సూర్యనారాయణ(60) రేగిడి మండలంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా పక్క గ్రామానికి వచ్చి.. అక్కడి నుంచి మడ్డువలసకు చేపలు కొనడానికి వచ్చారు. మత్య్సకారులు వచ్చే వరకు ఆయన నది గట్టుపై వేచిఉన్నారు. ఈక్ర మంలో బహిర్భూమికి వెళ్లి, నదిలో కాలు జారి పడిపోయారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల కూమార్తెకు పెళ్లి జరిపించారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ షేక్‌శంకర్‌ తెలిపారు.

Updated Date - Jun 27 , 2026 | 12:01 AM