Share News

బావిలో పడి వ్యక్తి మృతి

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:14 AM

మండలంలోని బూడిపేట గ్రామానికి చెందిన బూడి లక్ష్మణరావు(42) బావి లో పడి మృతి చెందారు.

 బావిలో పడి వ్యక్తి మృతి

గంట్యాడ అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని బూడిపేట గ్రామానికి చెందిన బూడి లక్ష్మణరావు(42) బావి లో పడి మృతి చెందారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ లక్ష్మణ రావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మణరావుకు గత 20 సంవత్సరాల కిందట అశ్వని అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన బుర్రకథలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈతరణంలో గత కొద్ది సంవత్సరాల కిందట ఈయన మండలంలోని పెదవేమ లి గ్రామానికి చెందిన డి.గౌరీ అనే మహిళను రెండో వివా హం చేసుకున్నారు. వీరికి కూడా ఒక కుమార్తె జన్మించింది. అయితే రెండో భార్య అయిన గౌరీ 2021 అక్టోబరు నెలలో మృతిచెందారు. అప్పటి నుంచి లక్ష్మణరావు విశాఖపట్నం కొమ్మదిలో రెండో భార్య కుమార్తె మాత కరుణశ్రీ ఇంట్లో వద్ద ఉంటున్నారు. కాగా ఈనెల 20న మొదటి భార్య స్వగ్రామమైన బూడిపేట వెళ్తా మని విశాఖపట్నం నుంచి వచ్చారు. కానీ మొదటి భార్య ఇంటికి రాలేదు. ఈనేప థ్యంలో గ్రామ సమీపలో ఉన్న నేలబావిలో లక్ష్మణరావు మృతదేహం శుక్రవారం బయటపడింది. రెండో భార్యపై ఇష్టం ఎక్కువగా ఉండటంతో లక్ష్మణరావు తన శరీరంపై గౌరీ అంటూ పచ్చబొట్లు వేయించుకున్నారు. గౌరీ చనిపోయిన నెలలో తాను కూడా చనిపోతానని పదే పదే కుటుంబీకులకు చెప్పినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:14 AM