గడ్డి మందు తాగి వ్యక్తి మృతి
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:12 AM
గడ్డి మందు తాగి ఓ వ్యక్తి మృతిచెందాడు.
రేగిడి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): గడ్డి మందు తాగి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బూరాడ గ్రామానికి చెందిన లావేటి జగ్గునాయుడు(47) గత కొంత కాలంగా తాగుడుకు బానిస య్యాడు. కుటుంబ సభ్యులు ఎంతచెప్పినా వినేవాడుకాదు. కుటుంబ సభ్యులను బెదిరించేందుకు ఆదివారం సాయంత్రం తాగిన మైకంలో ఇంటి సమీపంలో గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఈయనను కుటుంబీకులు రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచాడు. ఈయనకు భార్య గౌరీశ్వరీ, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఈయన మృతిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.