పిడుగు పాటుతో వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:38 AM
జోగిరాజుపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసిన సమయంలో పిడుగు పడి అదే గ్రామానికి చెందిన కొంచాడ సూరిసత్యం(58) మృతిచెందారు.
నెల్లిమర్ల, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): జోగిరాజుపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసిన సమయంలో పిడుగు పడి అదే గ్రామానికి చెందిన కొంచాడ సూరిసత్యం(58) మృతిచెందారు. సూరిసత్యం పొలం పని చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే కుటుంబీకులు 108 వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించినప్పటికే ఆయన మృతిచెందారు. మృతునికి భార్య, ఇద్దరు వివాహిత కుమారులు ఉన్నారు.