Share News

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:26 AM

ఆరికతోట, బూసాయవలస గ్రామా ల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు.

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

రామభద్రపురం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఆరికతోట, బూసాయవలస గ్రామా ల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. ఎస్‌ఐ వెలమల ప్రసా దరావు తెలిపిన వివరాల మేరకు.. మెంటాడ మండలం కుంటినవలస గ్రామా నికి చెందిన అల్లూరి బైౖరాగి (67) కాలినడకన బాడంగి మండలం వాడాడ వెళు తుండగా గుర్తుతెలియని వాహనం ఆయన్ని ఢీకొంది.. విషయం గమనించిన స్థానికులు ఆయన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే బైరాగి మృతి చెందారు. మృతుడి కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 02 , 2026 | 12:26 AM