రైలు ఢీకొని వ్యక్తి మృతి
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:18 AM
కొత్తవలస వడ్డీపేట గ్రామానికి చెందిన నెట్టి రాంబాబు(38) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం రైలు ఢీకొన్న ఘటనలో మృతిచెందాడు.
కొత్తవలస, జూన్ 12(ఆంధ్రజ్యోతి): కొత్తవలస వడ్డీపేట గ్రామానికి చెందిన నెట్టి రాంబాబు(38) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం రైలు ఢీకొన్న ఘటనలో మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే అవుట్‌పోస్ట్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాంబాబు కొత్తవలసలో రైలు పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై విజయనగరం జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేశారు.