Share News

రైలు ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:36 AM

మండలంలోని గరుడుబి ల్లి రైల్వే పట్టాలను దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

బొండపల్లి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని గరుడుబి ల్లి రైల్వే పట్టాలను దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమా దానికి సంబంధించి బొబ్బిలి జీఆర్‌పీ హెచ్‌సీ బి.ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నెలివాడ గ్రామానికి చెందిన ఈర్లి శ్రీరాములు(55) గరుడుబిల్లి వద్ద గల రైల్వే ట్రాకును దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈమేరకు మృత దేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలిం చారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:36 AM