Share News

రైలు ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:54 PM

మండలంలోని నర్సిపురం సమీపం లో గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

పార్వతీపురం రూరల్‌, మార్చి 24 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని నర్సిపురం సమీపం లో గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి 9 గంటల సమ యంలో నర్సిపురం గ్రామానికి చెందిన ఎన్‌. వెంకటేశ్వర్లు (31) రైలు ఢీకొని మృతి చెందా రు. వెంకటేశ్వర్లు బహిర్భూమికి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర్లు తల్లిదం డ్రులు మృతి చెందడంతో ఒంటరిగానే ఉం టున్నాడు. ఈ ఘటనపై జీఆర్‌పీ హెచ్‌సీ రత్నకుమార్‌ కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 24 , 2026 | 11:54 PM