Share News

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:57 PM

మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

  • మరొకరికి స్వల్ప గాయాలు

రేగిడి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలిజిపేట మండలం గలావిల్లి గ్రామానికి చెందిన కోండ్రు గోవింద(35) ఆదివారం తన అక్కను ద్విచక్ర వాహనంపై గురవాం గ్రామంలో దింపేందుకు వెళ్లాడు. తిరిగి తన బంధువైన గలావిల్లి గ్రామానికి చెందిన బొద్దాన అప్పలనాయుడుతో కలిసి స్వగ్రామం వస్తున్నారు. రేగిడి మండ లం కాగితాపల్లి గ్రామ సమీపంలోకి వచ్చేసరికి, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో గోవిందపైకి ట్రాక్టర్‌ ఎక్కిపోవడంతో ఆయన అక్కడికక్క డే మృతిచెందాడు. అప్పలనాయుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికు లు అప్పలనాయుడిని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవింద దుప్పట్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు దినేష్‌, హేమంత్‌ ఉన్నారు. ఈ ఘటనపై రేగిడి ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గలావిల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Updated Date - Apr 05 , 2026 | 11:57 PM