లారీ ఢీకొని వ్యక్తి మృతి
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:23 AM
సరుకుల కోసం రాజాం వచ్చి పని పూర్తయ్యాక ఇంటికి వెళ్తుండగా లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెంది న ఘటన రాజాంలో శనివారం చోటుచేసుకుంది.
రాజాం రూరల్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సరుకుల కోసం రాజాం వచ్చి పని పూర్తయ్యాక ఇంటికి వెళ్తుండగా లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెంది న ఘటన రాజాంలో శనివారం చోటుచేసుకుంది. రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రేగిడి మండలం ఉణుకూరు గ్రామానికి చెందిన కంటు గణేష్(36) అరసాడ జంక్షన్ వద్ద ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వ హిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఫాస్ట్‌పుడ్ సెంటర్‌కు అవసరమైన సరుకుల కోసం గణేష్ శనివారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై రాజాం వచ్చాడు. పని ముగించుకుని ఉణుకూరు వెళ్తుండగా.. రాజాం- డోలపేట రోడ్డులో పాలకొండ వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో గణేష్ బైకు పైనుంచి రోడ్డు మీద పడిపోయాడు. తలకు హెల్మెట్ ధరించినా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో హెల్మెట్ పగిలిపోయింది. తలకు తీవ్రంగా గాయాలై గణేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి బావ రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ అశోక్‌కుమార్ కేసు నమొదు చేశారు. ఎస్‌ఐ డి.చంద్ర కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.