Share News

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:20 AM

ప్రైవేటు బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెంది న ఘటన డెంకాడ మండలంలోని అయినాడ కూడలి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది.

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

డెంకాడ, మార్చి 8(ఆంధ్ర జ్యోతి): ప్రైవేటు బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెంది న ఘటన డెంకాడ మండలంలోని అయినాడ కూడలి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. విజయనగరం బాబామెట్ట నివాసి పులసా అప్పారావు(65) శనివారం సాయంత్రం ఆనందపురం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. అయినాడ కూడలి వద్దకు వచ్చేసరికి ప్రైవేటు బస్సు బలంగా ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుమారుడు వీరచక్రధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెంకాడ ఎస్‌ఐ ఆరంగి సన్యాసినాయుడు కేసు నమోదు చేశా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 12:20 AM