Share News

రోడ్డు దాటుతూ వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:23 AM

భార్య మృతి చెంది ఏడాది కాకముందే భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన శుక్రవారం సంభవించింది.

రోడ్డు దాటుతూ వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

  • మృతుడిది విజయనగరం జిల్లా

లావేరు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): భార్య మృతి చెంది ఏడాది కాకముందే భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన శుక్రవారం సంభవించింది. పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరి పురం గ్రామానికి చెందిన గొర్లె తేజేశ్వరరావు (50) శుక్రవా రం బెజ్జిపురం కూడలి వద్ద హైవేపై రోడ్డు దాటు తుండగా శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఓ వాహనం ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. తేజేశ్వరరావు కొంతకాలంగా లావేరు మండలం బుడతవలసలో కుమార్తె తేజశ్వ ని ఇంటి వద్ద ఉంటున్నాడు. స్వగ్రామం సిరిపురం వెళ్లేందుకు రోడ్డు దాటుతుం డగా వాహనం బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెం దాడు. భార్య దమయంతి గతఏడాది పాముకాటుకు గురై మృతి చెందింది. కుమారుడు రమణ నాలుగేళ్ల నుంచి అగ్నివీర్‌లో పనిచేస్తున్నాడు. కుమారుడు దూరంగా ఉండ డం, భార్య మృతి చెందడంలో కుమార్తె ఇంటి వద్ద తేజేశ్వ రరావు ఉంటున్నా డు. కుమారుడికి వివాహం కాలేదు. మృతుడిది వ్యవసాయ కుటుంబం. ఏడాదిలోగా భార్యా భర్తలను విధి వెంటాడింది. ఇద్దరు మృతి చెంద డంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమా ర్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లావేరు ఎస్‌ఐ వి.సందీ ప్‌కుమార్‌ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 29 , 2026 | 12:23 AM