Share News

లారీ ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:55 PM

లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

దత్తిరాజేరు, జూలై 19(ఆంధ్రజ్యోతి): లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్టేషన్‌ బూర్జవ లస పోలీసులు అందించిన వివరా ల ప్రకారం.. మండలంలోని కోరపుకొత్తవలస గ్రామానికి చెందిన బేత త్రినాథ (40), నల్ల చిట్టినాయుడులు ఆదివారం ద్విచక్ర వాహనంపై సొంత పనులపై రామభధ్రపురం వెళ్లారు. తిరిగి తమ స్వగ్రామం కోరపుకొత్తవలస వస్తుండగా.. బూర్జవలస పోలీసుస్టేషన్‌ సమీపాన అదే దారిలో వెనుక వైపు నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెనుక వైపు కూర్చున్న త్రినాథకు తలపై బలమైన గాయాల య్యాయి. దీంతో స్థానికులు 108కు సమాచారం అందించి త్రినాథను గజపతిన గరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే త్రినాథ మృతిచెందిన ట్టు వైద్యులు ధ్రువీకరించారు. ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న చిట్టినాయుడుకు గాయాలయ్యాయి. మృతుడికి భార్య ఇందు, కుమారులు ప్రవీణ్‌, బాలు ఉన్నారు. మృతుడు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం గజపతినగరం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 11:55 PM