ఆటో నుంచి జారిపడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:27 AM
ఆటో నుంచి జారిపడి తీవ్ర గాయాలపా లైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
వేపాడ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఆటో నుంచి జారిపడి తీవ్ర గాయాలపా లైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబం ధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస మండలం సంతపాలెం గ్రామానికి చెందిన గొటివాడ నాగరాజు(50) ఆదివారం సోంపురం జంక్షన్ నుంచి ఆటోలో వల్లంపూడి వెళ్తున్నాడు. ఆటో వేపాడ మండలంలోని అరిగిపాలెం గ్రామ సమీ పంలోకి వచ్చేసరికి నాగరాజు ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. చెవి నుంచి రక్తం కారడంతో 108 వాహనంపై ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కోడలు అలేక్య విశాఖపట్నంలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు మృతిచెందాడు.