మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - May 23 , 2026 | 12:27 AM
పూసపాటిరేగ గ్రామానికి చెందిన పచ్చిగుర్ల శ్రీనివాసరావు(52) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాదు శుక్రవారం తెలిపారు.
పూసపాటిరేగ(భోగాపురం), మే 22(ఆంధ్రజ్యోతి): పూసపాటిరేగ గ్రామానికి చెందిన పచ్చిగుర్ల శ్రీనివాసరావు(52) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాదు శుక్రవారం తెలిపారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పి.శ్రీనివాసరావు గ్రామంలో టిఫిన్ కొట్టు నడుపుతూ జీవనం కొనసాగి స్తున్నాడు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా టిఫిన్ కొట్టు సక్రమంగా నడవకపోవడం, చేతికందొచ్చిన ఇద్దరు కుమారులు స్థిరపడకపోవడం, సుమారు రూ.8లక్షల అప్పులు ఉండడంతో తీవ్ర మనస్థాపం చెందుతూ ఉండేవాడు. ఈనెల 20న రాత్రి ఎప్పటిలాగే అందరూ నిద్రపోయారు. మరసటిరోజు ఉదయం చూసేసరికి శ్రీనివాసరావు గడ్డి మందు తాగి అపస్మార క స్థితిలో పడి ఉండడంతో గమనించిన కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన శుక్రవారం మృతిచెందాడు. దీనిపై మృతు డు భార్య పి.కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.