రైలులో దొంగతనాల కేసులో వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:28 AM
విజయనగరం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం తో పాటు రన్నింగ్ రైళ్లల్లో ప్రయాణీకుల బ్యాగుల దొంగతనం కేసుల్లో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం దుర్గు జిల్లా బిలాయ్‌కి చెందిన నీలాపు మురళీమోహన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీరావు శనివారం తెలిపారు.
విజయనగరం, జూలై 18(ఆంధ్రజ్యోతి): విజయనగరం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం తో పాటు రన్నింగ్ రైళ్లల్లో ప్రయాణీకుల బ్యాగుల దొంగతనం కేసుల్లో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం దుర్గు జిల్లా బిలాయ్‌కి చెందిన నీలాపు మురళీమోహన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీరావు శనివారం తెలిపారు. రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మురళీమోహన్‌ను జీఆర్పీ, ఆర్‌పీఎఫ్, సీఐబీ టీం సిబ్బందితో అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనానికి పాల్పడినట్టు అంగీకరించాడని తెలిపారు. అతని వద్ద నుంచి రూ.20వేలు నగదు స్వాధీనం చేసుకుని, అతన్ని రిమాండ్‌కు తరలించామని చెప్పారు.