ఆలయాల్లో దొంగతనాల కేసులో వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:13 AM
విజయనగరం టూటౌన్ పోలీ సు స్టేషన్ పరిధిలోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి, 2.5 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు టూటౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): విజయనగరం టూటౌన్ పోలీ సు స్టేషన్ పరిధిలోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి, 2.5 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు టూటౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 11న ఎస్‌వీఎన్ నగర్ సాయిబాబా ఆలయంలో వెండి వస్తువులు పోయినట్టు అందిన ఫిర్యాదు మేరకు క్రైం బృందాలతో దర్యాప్తు చేపట్టామని ఆయన చెప్పారు. ఈక్రమంలో శనివారం రామకృష్ణనగర్ సమీపం లో వాహన తనిఖీలు చేపడుతుండగా.. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశాడని, వెంటనే సిబ్బంది సాయం ఆ వ్యక్తిని పట్టుకుని, విచారించామని ఆయన తెలిపారు. దీంతో ఆ వ్యక్తి నేరాన్ని అంగీకరిం చాడని, తన పేరు గుషిడి వెంకటేష్, డెంకాడ మండలం, చింతలవలస అని తెలి పాడన్నారు. ఈ మేరకు అతని వద్ద నుంచి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకు ని, రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. వెంకటేష్ నెల్లిమర్ల, విజయ నగరం రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆలయాల్లో కూడా దొంగతనాలకు పాల్పడ్డాడని సీఐ వివరించారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ కృష్ణమూర్తి, ప్రమీలాదేవి, క్రైం సిబ్బంది వాసు, గణేష్, సత్యనారాయణ, రామ్మోహన్‌లను ఎస్పీ అభినందించారని సీఐ తెలిపారు.