Share News

వృద్ధురాలిపై అఘాయిత్యం కేసులో వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:15 AM

విజయనగరం పట్టణానికి చెందిన 82 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

 వృద్ధురాలిపై అఘాయిత్యం కేసులో వ్యక్తి అరెస్టు

విజయనగరం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): విజయనగరం పట్టణానికి చెందిన 82 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విజయనగరం మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ పీవీవీ నరసింహా రావు కథనం ప్రకారం.. విజయనగరం పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు భిక్షాటన కోసం గాజులరేగ రైల్వే ట్రాక్‌ పరిసరాలలోని ఇళ్లకు వెళ్లి, తిరిగి వచ్చే క్రమం లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై మహిళా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితు డు విశాఖపట్నం నగరపరిధిలోని గాజువాకకు చెందిన శీల ప్రసాదరెడ్డిగా గుర్తిం చారు. ప్రసాదరెడ్డి గత 15 ఏళ్ల కిందట విజయనగరం పట్టణానికి వలస వచ్చి రైల్వేస్టేషన్‌ ప్రాంగణం, ట్రాక్‌ వెంబడి దేశ దిమ్మరిగా తిరిగి ప్లాస్టిక్‌, తదితర వ్యర్థాలను సేకరించి వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌ ఇ.నరసింహమూర్తి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అభినందించారు.

Updated Date - Aug 30 , 2026 | 12:15 AM