Share News

స్నేహితుడి గొంతు కోసిన వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:18 AM

స్నేహితుడి గొంతు కోసిన వ్యక్తిని వల్లంపూడి పోలీసులు అరెస్టు చేశారు.

స్నేహితుడి గొంతు కోసిన వ్యక్తి అరెస్టు

వేపాడ, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): స్నేహితుడి గొంతు కోసిన వ్యక్తిని వల్లంపూడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సింగరాయి గ్రామానికి చెందిన కొరువాడ లక్ష్మణ వేపాడ గ్రామంలో కొంత కాలంగా సెలూన్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. అయితే లక్ష్మణ, తన గ్రామానికి చెందిన గొల్ల సాయికుమార్‌తో కలిసి గతంలో అండమాన్‌లో పనిచేసేవారు. అక్కడ సాయికుమార్‌.. లక్ష్మణకు కొంత సొమ్మును ఖర్చుపెట్టాడు. ఆ తర్వాత లక్ష్మణ స్వగ్రామానికి వచ్చి, వేపాడలో సెలూన్‌ పెట్టుకున్నాడు. ఆ తర్వాత కొంత కాలానికి సాయికుమార్‌ తిరిగి స్వగ్రామం వచ్చాడు. లక్ష్మణ సెలూన్‌ పెట్టుకు న్నాడని తెలిసి ఈనెల ఒకటో తేదీన వేపాడలో ఉన్న సెలూన్‌ సెంటర్‌కు వెళ్లాడు. అండమాన్‌లో ఖర్చు చేసిన సొమ్ము అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈక్రమంలో లక్ష్మణ తన షాపులో ఉన్న మంగలి కత్తితో సాయికుమార్‌ గొంతుపై కోసేశాడు. స్థానికులు సాయికుమార్‌ను 108 వాహనంపై ఎస్‌.కోట ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అందిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్‌ విజయనగరం డీఎస్పీ వీరాకుమార్‌ దర్యాప్తు చేశారు. దర్యాప్తు అనంతరం కొరువాడ లక్ష్మణను శుక్రవా రం అరెస్టు చేసి, రిమాండ్‌ కు తరలించారు.

Updated Date - Apr 11 , 2026 | 12:18 AM