Share News

కానిస్టేబుల్‌పై దాడిచేసిన వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:53 PM

గత రెండు రోజుల కిందట గంట్యాడ గ్రామంలో జరిగిన ఎల్లమాంబ సిరిమానోత్సవంలో విధులు నిర్వహిస్తున్న పోలీ సు కానిస్టేబుల్‌ కాళ్ల వెంకటరమణపై తాగిన మైకంలో దాడి చేసి, గాయపరిచిన గంట్యాడ గ్రామానికి చెందిన సోము ఏసుపై గంట్యాడ పోలీసులు కేసు నమో దు చేశారు.

కానిస్టేబుల్‌పై దాడిచేసిన వ్యక్తి అరెస్టు

  • 14 రోజుల రిమాండ్‌

గంట్యాడ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): గత రెండు రోజుల కిందట గంట్యాడ గ్రామంలో జరిగిన ఎల్లమాంబ సిరిమానోత్సవంలో విధులు నిర్వహిస్తున్న పోలీ సు కానిస్టేబుల్‌ కాళ్ల వెంకటరమణపై తాగిన మైకంలో దాడి చేసి, గాయపరిచిన గంట్యాడ గ్రామానికి చెందిన సోము ఏసుపై గంట్యాడ పోలీసులు కేసు నమో దు చేశారు. ఈ విషయాన్ని విజయనగరం రూరల్‌ సీఐ లక్ష్మణరావు గురువారం స్థానిక విలేకర్లకు వెల్లడించారు. ఏసును వెంటనే అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా, మెజిస్ట్రేట్‌వారు 14 రోజుల రిమాండ్‌ విధించారని ఆయన చెప్పారు.

Updated Date - Feb 26 , 2026 | 11:53 PM