Share News

పీహెచ్‌సీల్లో మలేరియా పరీక్షలు చేయాలి

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:37 PM

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు ఆదేశించారు.

పీహెచ్‌సీల్లో మలేరియా పరీక్షలు చేయాలి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో భాస్కరరావు

- జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు

పార్వతీపురం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు ఆదేశించారు. కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఆరోగ్య పర్యవేక్షకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ల్యాబ్‌ల్లో నిర్వహించే వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎప్పటికప్పుడు ఎలక్ర్టానిక్‌ హెల్త్‌ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. వైద్యాధికారి సూచించిన పరీక్షలను ల్యాబ్‌ టెక్నీషియన్‌లు సత్వరమే జరిపి సకాలంలో ఫలితాలు అందజేయాలన్నారు. మలేరియా నిర్ధారణకు రక్తపూతలు సేకరించి మైక్రో స్కోప్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎక్కడైనా కేసు నమోదైతే తక్షణమే ఆ ప్రాంతంలో మాస్‌, కాంటాక్ట్‌ శాంపిల్స్‌ తీసి సర్వే చేయాలన్నారు. కలెక్టర్‌ ప్రవేశపెట్టిన మా ఊరికి మలేరియా వచ్చింది కార్య క్రమాన్ని ఆ గ్రామంలో అందరి సమన్వయంతో నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు, డాక్టర్‌ ఎం.వినోద్‌కుమార్‌, డీబీడీ జిల్లా కన్సల్టెంట్‌ రామచంద్ర, సిబ్బంది ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 11:37 PM