‘మలేరియా పరీక్షలు తప్పనిసరి’
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:12 AM
మలేరియా చికిత్స అనంతరం పరీక్షలు చేయించుకోవాలని జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ సూచించారు.
కొమరాడ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మలేరియా చికిత్స అనంతరం పరీక్షలు చేయించుకోవాలని జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ సూచించారు. బుధవారం బంజుకుప్ప గ్రామంలో మలేరియా బాధితుడిని ఆయన పరామర్శించారు. అనంతరం నిర్వహించిన మలేరియా నివారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన దోమ తెరలను సక్రమంగా వినియోగించాలన్నారు. ఫోకల్ స్ర్పేయింగ్, లార్వా నిర్మూలన పనులను సకాలంలో చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కన్సల్టెంట్ రామచంద్ర, సబ్ యూనిట్ అధికారి రాధాకృష్ణ, రామకృష్ణ ఉన్నారు.