Malaria one time and again! మళ్లీ మళ్లీ మలేరియా!
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:09 AM
Malaria one time and again! జూన్, జూలై నెలలు వచ్చాయంటే చాలు మండలంలోని గిరిశిఖర పంచాయతీ దారపర్తి గిరిజనులకు వణుకే.. ఎవరు మంచం పట్టాల్సి వస్తుందో.. ఆ సమయానికి వైద్యం అందుతుందో లేదో.. తక్షణం వైద్యుని వద్దకు తీసుకువెళ్లగలమో లేదోనని భయపడుతుంటారు. ఇప్పుడూ అదే పరిస్థితి. కొద్దిరోజులుగా మలేరియా జ్వరాలు వస్తుండడంతో విలవిల్లాడుతున్నారు. పిల్లలు, పెద్దలు కూడా జ్వరాలతో బాధపడుతున్నారు.
మళ్లీ మళ్లీ మలేరియా!
ఏటా ఏజెన్సీ వాసులకు తప్పని అనారోగ్య సమస్య
వర్షాకాలం వస్తే వారికి వణుకే
దోమ తెరలు పంపిణీ చేయని అధికారులు
ఆవేదనలో గిరిజనులు
వైద్యశాఖ చొరవే కీలకమంటున్న ఆరోగ్య పరిశీలకులు
జూన్, జూలై నెలలు వచ్చాయంటే చాలు మండలంలోని గిరిశిఖర పంచాయతీ దారపర్తి గిరిజనులకు వణుకే.. ఎవరు మంచం పట్టాల్సి వస్తుందో.. ఆ సమయానికి వైద్యం అందుతుందో లేదో.. తక్షణం వైద్యుని వద్దకు తీసుకువెళ్లగలమో లేదోనని భయపడుతుంటారు. ఇప్పుడూ అదే పరిస్థితి. కొద్దిరోజులుగా మలేరియా జ్వరాలు వస్తుండడంతో విలవిల్లాడుతున్నారు. పిల్లలు, పెద్దలు కూడా జ్వరాలతో బాధపడుతున్నారు.
ఎస్.కోట రూరల్, జూలై 20(ఆంధ్రజ్యోతి):
మలేరియా మహ్మమారి ఈరెండునెలల కాలంలో చిన్నపెద్ద అన్న తేడా లేకుండా పంజా విసురుతుంటుంది. అయితే జ్వరం వచ్చినందుకు వారికి చింత లేదు. ఆ వ్యాధిని వదిలించుకోవడంపైనే వారికి టెన్షన్. సరైన రహదారి సౌకర్యం లేక సంతలు జరిగే ప్రాంతాల్లో వుండే ఆర్‌ఎంపీ,పీఎంపీల వైద్యసేవలే ఆధారం. ఆ సమయానికి జ్వరం సాధారణంగా ఉంటే పరవాలేదు. అసాధారణంగా ఉంటే దేవుడిపై భారం వేస్తున్నారు. కొట్టాం పీహెచ్‌సీ సిబ్బంది ప్రత్యేకించి వారికి నిర్దేశించిన రోజుల్లో వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆ సమయంలో మాత్రమే గిరిజనులు ఉచిత వైద్యం పొందగలుతున్నారు. కొట్టాం పీహెచ్‌సీ, బొడ్డవర కోలొకేటెడ్ పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది ఈరెండునెలల కాలంలో పలుమార్లు కొండపై వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. అయినా మలేరియా అదుపులోకి రావడం లేదు. శాశ్వతంగా ఎందుకు నివారించలేకపోతున్నారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీ వాతావరణం.. తాగే నీరు వల్ల మలేరియా దోమలు ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పే వైద్యులు, ప్రభుత్వాలు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోరన్నది వారి ప్రధాన ఆవేదన. రక్షిత తాగునీరు, కొండప్రాంతాల్లో వుండే గిరిజనులకు సరిపోయేలా దోమతెరలు పంపిణీ చేస్తే జ్వరాలు తగ్గుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యం ప్రబలితే వెనువెంటనే కొండ పైనుంచి కిందకు దిగి వైద్యం పొందేలా రహదారి లేకపోవడం వారికి శాపంగా మారింది.
- కాగా గడిచిన జూన్ నెలతో పాటు జూలైలో కొట్టాం పీహెచ్‌సీ పరిధిలో వున్న గిరిశిఖర పంచాయతీ దారపర్తి శివారు గ్రామాల్లో ఎన్ని మలేరియ కేసులు నమోదయ్యాయో కొట్టాం పీహెచ్‌సీ వైద్యాధికారులు స్పష్టంగా చెప్పడం లేదు. దారపర్తి నుంచి ఇటు ఎస్.కోట సీహెచ్‌సీలో జూన్‌లో 20వరకు మలేరియ కేసులు, జూలైలో ఇప్పటివరకరు నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇదే విధంగా ఎస్.కోటలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో పదులసంఖ్యలో గిరిజనులు మలేరియాతో చికిత్స పొందుతున్నారు.