Share News

ఓటమిని సహించలేక అర్థరహిత వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:24 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని సహించలేక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ నాయకులు అర్థ రహిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా మని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

ఓటమిని సహించలేక అర్థరహిత వ్యాఖ్యలు

  • మంత్రి శ్రీనివాస్‌

గజపతినగరం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని సహించలేక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ నాయకులు అర్థ రహిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా మని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవా రం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పూసపాటిరేగ మండలం లో వైస్‌ ఎంపీపీకి సంబంధించి కూటమిలో 13 మంది ఎంపీటీసీలు ఉన్నారని, అధికారుల సమ న్వయ లోపం వల్ల రెండో రోజు ఎన్నిక జరిగిందని చెప్పారు. 2019-24 మధ్య జరిగిన ఎన్నికలు అప్పటి ప్రభుత్వం ఎలా నిర్వహించిందో అందరూ చూశారని, ప్రస్తుతం ఎన్ని కలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ఓటమిని ఓర్వలేక స్థానిక వైసీపీ నాయ కులు మతిభ్ర మించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గజపతినగరం నియోజకవర్గంలో 76 ఎంపీటీసీ సెగ్మెంట్లకు 66 సెగ్మెంట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుందని ఆయన గుర్తుచేశారు. మిగిలిన సెగ్మెం ట్లు స్వల్ప మెజార్టీతో కూటమి నాయకులు ఓటమి పొందారని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 12:24 AM