Share News

‘డీఎస్సీపై అసత్య ఆరోపణలు తగవు’

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:34 AM

డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిపై వైసీపీ నాయకులు రాజకీయ దురుద్దేశంతో అసత్య ఆరోపణ లు చేయడం సరికాదని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

‘డీఎస్సీపై అసత్య ఆరోపణలు తగవు’
రవికుమార్‌ కుటుంబంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం రూరల్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిపై వైసీపీ నాయకులు రాజకీయ దురుద్దేశంతో అసత్య ఆరోపణ లు చేయడం సరికాదని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఆదివారం అడ్డాపుశీల గ్రామానికి చెందిన డీఎస్సీ విజేత రవికుమార్‌ కుటుంబాన్ని ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రవికుమార్‌ 2008లో అదే విధంగా 2014, 2018లో డీఎస్సీలో ప్రయత్నించి నప్పటికీ ఉద్యోగం దక్కలేదన్నారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా కష్టపడి చదివి 2025లో డీఎస్సీ రాసి స్కూల్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారన్నారు. ఉద్యోగాలు సాధించిన యువతకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అభ్యర్థులు ఎంత కష్టపడి డీఎస్సీ సాధించారో ప్రజలకు తెలుసనన్నారు. అలాంటి అభ్యర్థులు డబ్బులు పెట్టి ఉద్యోగాలు కొనుక్కున్నారంటూ హేయమైన రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. ప్రజలే వాస్తవాలను గమనించాలన్నారు. డీఎస్సీ నిర్వహణకు ముందు దాన్ని అడ్డుకునేందుక వైసీపీ పెద్ద సంఖ్యలో కేసులు పెట్టించిందన్నారు. అయినా వాటిని కూటమి ప్రభుత్వం ఎదుర్కొని కేవలం 140 రోజుల్లో డీఎస్సీ నియామక ప్ర క్రియను పూర్తి చేసిందని వివరించారు. ఉద్యోగాలు సాధించిన యువత అఽధైర్యపడాల్సిన అవసరం లేదని, అసత్య ఆరోపణలను పట్టించుకోకుండా ధైర్యంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:34 AM