ఆత్మగౌరవ ర్యాలీలో మీ గొంతు వినిపించండి
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:09 AM
‘డీఎస్సీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి నిరసనగా వచ్చే నెల 10న విజయవాడలో నిర్వహించనున్న ఆత్మ గౌరవ ర్యాలీలో మీ గొంతును బలంగా వినిపించాల’ని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్.. ఇటీవల డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను కోరారు.
రాజాం ఎమ్మెల్యే కోండ్రు
రాజాం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ‘డీఎస్సీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి నిరసనగా వచ్చే నెల 10న విజయవాడలో నిర్వహించనున్న ఆత్మ గౌరవ ర్యాలీలో మీ గొంతును బలంగా వినిపించాల’ని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్.. ఇటీవల డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను కోరారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయ న రాజాం పట్టణంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈక్రమంలో మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగం పొంది జిల్లాలో ఐదో ర్యాంకు సాధించి రాజాం డోలపేటలో ఉపాధ్యాయురా లిగా పనిచేస్తున్న ఆశపు లక్ష్మీ ప్రసన్న ఇంటికి వెళ్లారు. ఈసందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ ఎంతో పారదర్శంగా మెగా డీఎస్సీ నిర్వహించి అభ్యర్థులకు అండగా నిలిచారన్నారు. ఈసందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొని, మీ గొంతును బలంగా వినిపించాల’ని కోరారు. ఈ కార్యక్రమంలో మరిపి జగన్మోహన్‌రావు, పిల్లా సత్యంనాయుడు, గురవాన నారాయణరావు, దుప్పపూడి శ్రీనివాసరావు, వంగా వెంకటరావు, శాసపు రాజేష్, గార గున్ననాయుడు తదితరులు పాల్గొన్నారు.