సమన్వయంతో సభను జయప్రదం చేయండి
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:35 AM
వచ్చే నెల ఒకటో తేదీన జరిగే మోదీ సభను అధికారులు, నాయకులు సమన్యయంతో జయప్రదంచేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోరారు. భోగాపురం విమాశ్రయం ప్రారంభ కార్యక్రమానికి చీపురుపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం నాయకులు తగిన ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు.
చీపురుపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల ఒకటో తేదీన జరిగే మోదీ సభను అధికారులు, నాయకులు సమన్యయంతో జయప్రదంచేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోరారు. భోగాపురం విమాశ్రయం ప్రారంభ కార్యక్రమానికి చీపురుపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం నాయకులు తగిన ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. ఆదివారం చీపురుపల్లిలోని టీడీపీకార్యాలయంలో పార్టీనాయకులు, కార్యకర్తలతో సమీ క్షించారు. ఈ సందర్భంగా మండలాలు, గ్రామాల వారీగా కార్యక్రమానికి బయలుదేరే వారి సంఖ్య, వారికి అవసరమైన ఏర్పాట్లు, వాహనాలు సంఖ్య, రూట్లు, బయలుదేరే సమయం, బాధ్యుల వివరాలు, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమానికి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరే వరకూ వారి బాధ్యతను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దే బాబూరావు, పుచ్చ విజయకుమార్ మాట్లాడారు.