Share News

‘ఇంటింటికీ ప్రభుత్వం’ విజయవంతం చేయండి

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:25 AM

టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు ‘ఇంటింటికీ ప్రభుత్వం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు కోరారు.

 ‘ఇంటింటికీ ప్రభుత్వం’ విజయవంతం చేయండి

  • ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు ‘ఇంటింటికీ ప్రభుత్వం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు కోరారు. చీపురుపల్లిలోని టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా ఇంటింటికీ వెళ్లి వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నా రు. ప్రతి బూత్‌ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు గరిష్టంగా రోజుకు 30 ఇళ్లను సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌ మల్లిక్‌నాయుడు, రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, టి.కిరణ్‌, వెన్నె సన్యాసినాయుడు, తాడ్డి సన్యాసినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:25 AM