ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయండి
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:39 AM
భోగాపురం అంత ర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో కార్య క్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పిలుపు నిచ్చారు.
సాలూరు, జూలై 29 (ఆంధ్ర జ్యోతి): భోగాపురం అంత ర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో కార్య క్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పిలుపు నిచ్చారు. బుధవారం సాలూరులోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, యూనిట్ ఇన్‌చార్జిలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ హాజరవుతున్న చారిత్రక ప్రారంభోత్సవ సభకు నియోజకవర్గం నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాల న్నారు. నియోజకవర్గం నుంచి 5వేల మందిని సభకు తరలించాలన్నారు. అలాగే 13 వేల మంది గిరిజన బాలికలు థింసా నృత్యం చేసేందుకు బుధ వారం సాయంత్రానికి సభా ప్రాంగణానికి చేరుకోనున్నారన్నారు. సమావేశంలో ప్రత్యేక పరిశీలకుడు పొలంరెడ్డి దినేష్‌రెడ్డి పాల్గొన్నారు.