లోక్ అదాలత్‌ను జయప్రదం చేయండి
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:33 AM
జాతీయ లోక్ అదాలత్‌ను 11న జయప్రదం చేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూర్తి కోరారు.
బొబ్బిలి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్ అదాలత్‌ను 11న జయప్రదం చేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూర్తి కోరారు. స్ధానిక కోర్టులో పోలీసు అధికారులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లతో సమావేశం నిర్వహించారు. కక్షిదారులకు అవగాహన కల్పించి తమ వివాదాలను రాజీమార్గంలో లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. సమావేశంలో అడిషనల్ జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ర్టేట్ ఎం.రోహిణీరావు, సీఐ కింతలి నారాయణరావు తదతరులు పాల్గొన్నారు.