Share News

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:21 PM

జిల్లా కోర్టు ప్రాంగణంలో డిసెంబరు 12న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌కు కక్షిదారులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి, న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ ఎం.బబిత అన్నారు.

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి బబిత

- జిల్లా ప్రధాన న్యాయాధికారి బబిత

విజయనగరం, నవంబరు 4 (ఆంరఽధజ్యోతి): జిల్లా కోర్టు ప్రాంగణంలో డిసెంబరు 12న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌కు కక్షిదారులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి, న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ ఎం.బబిత అన్నారు. బుధవారం ఇన్సూరెన్స్‌, బ్యాంకు, చిట్‌ఫండ్‌ అధికారులు, న్యాయవాదులతో జిల్లా కోర్టు ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు, అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు ఆసరాగా నిలిచే ఇన్సూరెన్స్‌ మొత్తాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయాలన్నారు. కక్షిదారులకు లోక్‌ అదాలత్‌తో సమయం, డబ్బు, ఆదా అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కృష్ణప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌, అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 11:21 PM