‘సేవాసేతు’ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:19 AM
పీఎం సూర్యఘర్ ముఫ్తు బిజీలీ యోజనపై విద్యుత్ వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా సేవా సేతు క్యాంపులను నిర్వహించనున్నట్టు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరు మువ్వల లక్ష్మణరావు తెలిపారు.
-ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పీఎం సూర్యఘర్ ముఫ్తు బిజీలీ యోజనపై విద్యుత్ వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా సేవా సేతు క్యాంపులను నిర్వహించనున్నట్టు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరు మువ్వల లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ వద్ద సేవా సేతు క్యాంపును ప్రారం భించి కరపత్రాలను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, భోగాపురం, రాజాం, శృంగవరపుకోట, గజపతినగరం, బాడంగి, బొబ్బిలి డివిజన్ల పరిధిలో అక్టోబరు 17 వరకూ సేవా సేతు క్యాంపులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇళ్ల పైకప్పులపై రాయితీతో సోలార్ రూప్‌టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే వినియోగదారులకు అక్కడికక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర ్యం ఉంటుందని తెలిపారు. విద్యుత్‌శాఖాధికారులు, సిబ్బందితో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సోలార్ వెండర్లు ఈ క్యాంపులో అందుబాటులో ఉండి, రుణాలు, సాంకేతిక సందేహాలపై పూర్తి సమాచారం అందిస్తారన్నారు. పర్యావరణ పరిరక్షణకు, హరిత విద్యుత్ ఉత్పత్తికి సహకరిస్తూ, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలన్నారు. వినియోగదారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వీవీ రమణమూర్తి, ఈఈ పూడి హరి, ఏఈలు, విద్యుత్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు.